Pan Card: పాన్ కార్డు దరఖాస్తుకు ఇకపై తండ్రి పేరు తప్పనిసరి కాదు!
- నిబంధనలను సడలించిన సీబీడీటీ
- తండ్రి మరణించినా, తల్లికి దూరంగా ఉన్నా వర్తింపు
- డిసెంబర్ 5 నుంచి అమలులోకి
పర్మినెంట్ ఎకౌంట్ నంబర్ (పాన్) దరఖాస్తులో ఇకపై తండ్రి పేరును తప్పనిసరిగా తెలియజేయాల్సిన నిబంధనను సడలించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) తెలియజేసింది. తల్లి మాత్రమే ఉన్నవారికి ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తాజా ఆదేశాల మేరకు మరణించిన లేదా తల్లిని వదిలి దూరంగా ఉన్న తండ్రి పేరును దరఖాస్తులో తెలియపరచాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు సీబీడీటీ ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి తాజా మార్పులు అమలులోకి వస్తాయని తెలిపింది.