Virat Kohli: విరాట్ అనుష్కల చిలిపి తగాదా... లక్షలాది లైక్ లు, కామెంట్లు!

  • గతంలో వచ్చిన 'మాన్యవర్ మాహే' యాడ్
  • మరికొన్ని వారాల్లో విరుష్కల తొలి వెడ్డింగ్ యానివర్శరీ
  • కొత్త వ్యాపార ప్రకటన విడుదల చేసిన సంస్థ

బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీ కపుల్ అనుష్క, విరాట్ లు నటించగా, గతంలో ఎప్పుడో వచ్చిన 'మాన్యవర్ మాహే' వ్యాపార ప్రకటన గుర్తుందా? పెళ్లికి ముందు వారిద్దరూ కలిసి చేసిన యాడ్ అది. ఇప్పుడు అదే సంస్థ వీరిద్దరి ఫస్ట్ మ్యారేజ్ డేకి కొన్ని వారాల ముందు మరో ప్రకటన తయారు చేయగా,  ఇప్పుడది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అన్యోన్యమైన జంట ఎలా ఉండాలో చెప్పే ఈ యాడ్ లో పెళ్లికి ముందు ప్రమాణాలు, పెళ్లి తరువాత ఆ జంట చిలిపి తగాదాలను చూపించారు. తాజాగా అనుష్క, తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ యాడ్ వీడియోను పోస్టు చేయగా, 'బెస్ట్ కపుల్ ఆఫ్ ది వరల్డ్' అంటూ లక్షలాది లైక్ లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంటను అభినందించిన వారిలో కరణ్ జోహార్, శశాంక్ ఖైతాన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

Virat Kohli
Anushka Sharma
Add
Instagram
  • Loading...

More Telugu News