Revanth Reddy: ఇద్దరు కాదు.. ముగ్గురు ఎంపీలు పార్టీ మారబోతున్నారు: రేవంత్ మరో సంచలన ప్రకటన

  • విశ్వేశ్వరరెడ్డి రాజీనామాపై స్పందించిన రేవంత్
  • టీఆర్ఎస్ నుంచి మరో రెండు వికెట్లు
  • సోనియా బహిరంగ సభకు ఏర్పాట్ల పరిశీలన

తాను ఇద్దరు ఎంపీలు పార్టీలో చేరబోతున్నారంటూ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని.. అయితే ఇద్దరు కాదని.. ముగ్గురు ఎంపీలు పార్టీ మారబోతున్నారంటూ తాజాగా ప్రకటించి, రేవంత్ రెడ్డి మరో సంచలనానికి తెరదీశారు. నేటి సాయంత్రం విశ్వేశ్వరరెడ్డి రాజీనామాపై స్పందించిన రేవంత్ మరో ఇద్దరు ఎంపీలు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్నారు.

డిసెంబర్ 7 డెడ్‌లైన్ అని.. టీఆర్ఎస్ నుంచి మరో రెండు వికెట్లు పడబోతున్నాయని పేర్కొన్నారు. తాను చెప్పినపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని.. ఆ ఎంపీలు పార్టీ మారినప్పుడు అందరికీ అర్థమవుతుందన్నారు. ఈ నెల 23న మేడ్చల్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనే బహిరంగ సభ ఉన్నందున నేడు రేవంత్ ఆ ఏర్పాట్లను పరిశీలించారు.

Revanth Reddy
visweswar Reddy
TRS
December
Sonia Gandhi
  • Loading...

More Telugu News