Jagan: ఆపరేషన్ గరుడపై విచారణ చేపడితే ఎన్నో విషయాలు తెలుస్తాయి: జగన్

  • రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు
  • ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి
  • వైద్య సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం

ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ గరుడపై విచారణ చేపడితే ఎన్నో విషయాలు బయటకు వస్తాయన్నారు. విజయనగరం జిల్లాలోని కురుపాంలో నేడు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ‘ఆపరేషన్ గరుడ’లో పేర్కొన్నట్టు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందంటున్న చంద్రబాబు.. రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి తెరదీస్తున్నారని ఆరోపించారు. కురుపాం జిల్లాలో కనీస వైద్య సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్ర సమస్యలపై ఏనాడు కోర్టుకు వెళ్లని చంద్రబాబు.. ఐటీ సోదాలపై మాత్రం సుప్రీంకోర్టుకు వెళతానంటున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారని జగన్ ఆరోపించారు.

Jagan
Chandrababu
Operation Garuda
Vijayanagaram District
Supreme Court
  • Loading...

More Telugu News