eetala rajender: నా కుడిభుజం ఈటల చాలా బలంగా ఉండాలి..మీరు గెలిపించాలి: సీఎం కేసీఆర్

  • ఎనభై శాతం ఓట్లు రాజేందర్ కే పడతాయి
  • మెజార్టీ లక్ష ఓట్లకు తక్కువ కాకుండా గెలిపించాలి
  • ఇలాంటి వ్యక్తి హుజురాబాద్ లో ఉండటం ప్రజల అదృష్టం

తన కుడిభుజం ఈటల రాజేందర్ అని, ఆ కుడి భుజం బలంగా ఉండాలంటే, ఆయన మెజార్టీ లక్ష ఓట్ల కన్నా తక్కువ రావద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఉదయమే తనకు సర్వే రిపోర్టు అందిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎనభై శాతం ఓట్లు రాజేందర్ కే పడతాయని తెలిసిందని అన్నారు.

ఇది తన స్టోరీ కాదు అని, సర్వే చెబుతున్న మాట అని, మెజార్టీ లక్ష ఓట్లకు తక్కువ కాకుండా గెలిపించాలని, ఆ చైతన్యాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చూపించాలని కోరారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి విషయంలో, ప్రభుత్వ నిర్వహణలో అద్భుతంగా పని చేసిన వ్యక్తి ఈటల అని ప్రశంసించారు. ఒక బలహీనవర్గం నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు రాజేందర్ అని, ఇలాంటి వ్యక్తి హుజురాబాద్ లో ఉండటం ప్రజల అదృష్టమని కొనియాడారు.

eetala rajender
cm kcr
  • Loading...

More Telugu News