Konda Visweswara Reddy: టీఆర్ఎస్‌కు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా

  • ప్రచార కార్యక్రమాలకు దూరం
  • కేటీఆర్ మాట్లాడినా ఫలితం శూన్యం
  • 23న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

ఇటీవల కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు, దమ్ముంటే ఆపాలంటూ టీఆర్ఎస్ అధిష్ఠానానికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రేవంత్ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌కి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు.

తెలంగాణలో ఎన్నికలు సమీపస్తున్న ఈ తరుణంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్ సవాల్ నేపథ్యంలో కేటీఆర్ విశ్వేశ్వరరెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. విశ్వేశ్వర్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి ఈనెల 23న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Konda Visweswara Reddy
Congress
Sonia Gandhi
Revanth Reddy
KTR
  • Loading...

More Telugu News