congress: ‘కాంగ్రెస్’ రెబెల్ రోహిన్ రెడ్డిని బుజ్జగించిన ఉత్తమ్!

  • కొన్ని పరిస్థితుల వల్లే టికెట్ ఇవ్వలేదన్న ఉత్తమ్
  • రోహిన్ రెడ్డి, మధుకర్ యాదవ్ లకు సముచిత స్థానం?
  • ఉత్తమ్ వివరణతో సంతృప్తి చెందిన రోహిన్

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుడు రోహిన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిన్ కు బుజ్జగింపు చర్యలు మొదలయ్యాయి. టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన్ని బుజ్జగించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగానే టికెట్ ఇవ్వలేకపోయామని ఉత్తమ్ చెప్పినట్టు సమాచారం.

రోహిన్ రెడ్డి, మధుకర్ యాదవ్ లకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తమ్ వివరణతో రోహిన్ రెడ్డి సంతృప్తి చెందారని, రెబెల్ అభ్యర్థిగా వేసిన తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటానని చెప్పినట్టు సమాచారం. కాగా, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దాసోజ్ శ్రవణ్ కుమార్ బరిలో ఉన్నారు.

congress
rohin reddy
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News