Telangana: జనసేన పార్టీకి ఆశించినంత మైలేజీ రావటం లేదు: కేఏ పాల్

  • తెలంగాణలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది
  • 43 మంది రెబల్ అభ్యర్థులు నన్ను కలిశారు
  • రెండు రాష్ట్రాల్లోనూ మా పార్టీ పోటీ చేస్తుంది

ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఆశించినంత మైలేజీ అయితే రావటం లేదని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పేర్కొన్నారు. నేడు ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ పార్టీ గెలుపు సాధించినా.. అది స్వల్ప మెజారిటీతోనే అధికారంలోకి వస్తుందని కేఏ పాల్ జోస్యం చెప్పారు. అన్ని పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు మొత్తం 43 మంది తనను కలిశారని ఆయన స్పష్టం చేశారు. ఇక తమ పార్టీ విషయానికి వస్తే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని వెల్లడించారు.

Telangana
KA Paul
Janasena
Pavan Kalyan
Praja shanthi
  • Loading...

More Telugu News