ntr: కల్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్

- హీరోగా కల్యాణ్ రామ్ కి దక్కని హిట్
- మైత్రీ నిర్మాతలకి ఒక మాట వేసిన ఎన్టీఆర్
- కల్యాణ్ రామ్ కి సరిపడే కథ కోసం అన్వేషణ
కల్యాణ్ రామ్ ఒక వైపున నిర్మాతగా ... మరో వైపున హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిర్మాతగా 'జై లవ కుశ' మినహా ఈమధ్య కాలంలో ఆయనకి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లేవు. ఇక హీరోగాను ఆయన ఇటీవల కాలంలో హిట్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.
