Harish Rao: కేసీఆర్ మాకు నేర్పించింది ఇదే: హరీష్ రావు

  • ఎంత ఎదిగితే.. అంత ఒదిగి పని చేయాలని కేసీఆర్ మాకు నేర్పించారు
  • సిద్ధిపేటకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం లభించింది
  • ఈ పరీక్షా సమయంలో నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం

ఎంత ఎదిగితే, అంత ఒదిగి పని చేయాలని తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్పించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా సిద్ధిపేటకు సేవ చేసే అదృష్టం తనకు లభించిందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో సిద్ధిపేటను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిలా తాను ఉన్నానని చెప్పారు. ఇప్పుడు పరీక్షా సమయం వచ్చిందని... పరీక్షలో తనకు ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టమని అన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ సిద్ధిపేట ఎన్నికల సభకు వచ్చినప్పుడు మూడు హామీలు ఇచ్చారని, వాటన్నింటినీ నెరవేర్చి, ఇప్పుడు మళ్లీ వచ్చారని హరీష్ చెప్పారు. సమయాభావం వల్ల రెండు నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగిస్తున్నానని తెలిపారు.

Harish Rao
kcr
siddipet
TRS
campaign
  • Loading...

More Telugu News