vijayashanti: కాంగ్రెస్ పోస్టర్ పై మండిపడ్డ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి

  • ఎన్నికల ప్రచారానికి వస్తున్న సోనియా, రాహుల్
  • కాంగ్రెస్ విడుదల చేసిన పోస్టర్ లో కనిపించని మహిళా నేతలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్ పెద్దలపై ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 23న ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టరే విజయశాంతి ఆగ్రహానికి కారణమైంది. పోస్టర్ లో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలను మాత్రమే ఉంచారని, ఒక్క మహిళా నాయకురాలి ఫొటోను కూడా ఉంచలేదని ఆమె మండిపడ్డారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పై మనం విమర్శలు గుప్పిస్తున్నామని... మన పోస్టర్ లో ఒక్క మహిళ ఫొటో కూడా లేకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఈ సభలో కేవలం మగవాళ్లు మాత్రమే కాకుండా, మహిళలు కూడా పాల్గొంటారు కదా అని ప్రశ్నించారు.

vijayashanti
tpcc
congress
poster
fire
Sonia Gandhi
Rahul Gandhi
  • Loading...

More Telugu News