Jagan: మీ స్టేట్మెంట్ ఇవ్వండి.. జగన్ కు మరోసారి నోటీసులు పంపించిన సిట్!

  • స్టేట్ మెంట్ ఇవ్వాలని నోటీసులు
  • గతంలో ఇచ్చేందుకు నిరాకరించిన జగన్
  • రెండు వారాల్లో హైకోర్టుకు నివేదిక

విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వాలని, కేసును విచారిస్తున్న సిట్ అధికారులు వైకాపా అధినేత వైఎస్ జగన్ కు మరోసారి నోటీసులు పంపారు. మరో రెండు వారాల్లో కేసు విచారణ గురించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సివున్న కారణంగా విచారణను త్వరితగతిన ముగించాలని సిట్ నిర్ణయించింది.

 ఈ కేసులో జగన్ వాంగ్మూలం సేకరించకుండా నివేదిక పూర్తి కాదు కాబట్టి, ఆయన్ను విచారించాలన్న ఉద్దేశంతో మరోసారి నోటీసులు పంపింది. జగన్ పై దాడి జరిగిన మరుసటి రోజునే, పోలీసులు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రాగా, స్టేట్ మెంట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజా నోటీసులపై జగన్ ఇంకా స్పందించలేదు.

Jagan
High Court
SIT
Vizag
Airport
  • Loading...

More Telugu News