Karan Johar: వాళ్లిద్దరూ డేటింగ్ లో లేరు... కానీ అన్ని చోట్లా ఇద్దరూ కలిసే కనిపిస్తుంటారు: చెల్లి గురించి అర్జున్ కపూర్

  • కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో అర్జున్ కపూర్, జాన్వీ
  • ఈషాన్ తో డేటింగ్ పై కరణ్ ప్రశ్న
  • అలాంటిదేమీ లేదన్న జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాలో ఈషాన్ తో కలసి ఆమె నటించింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా బీటౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు, కరణ్ జొహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం తదుపరి ఎపిసోడ్ లో అర్జున్ కపూర్, అతని సోదరి జాన్వీలు కలసి కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కార్యక్రమ నిర్వాహకులు షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఈషాన్ తో మీరు డేటింగ్ లో ఉన్నారా? అంటూ జాన్వీని కరణ్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆమె 'నో' అని తెలిపింది. వెంటనే కలగజేసుకున్న అర్జున్ కపూర్... ఈషాన్ తో ఆమె డేటింగ్ లో లేదని... కానీ ఎక్కడ చూసినా వాళ్లిద్దరూ కలిసే కనిపిస్తున్నారని చెప్పాడు. అన్న చెప్పిన మాటలకు జాన్వీ షాక్ అయింది. తమ గురించి ఇంకా ఏం చెబుతాడో అనే టెన్షన్ ఆమె ముఖంలో కనిపించింది.

Karan Johar
arjun kapoor
jhanvi
ishan
dating
coffee with karan
  • Loading...

More Telugu News