tTelugudesam: 14వ సీటును వదులుకోవడానికి కారణం ఇదే: టీటీడీపీ నేత రావుల

  • మహాకూటమి గెలుపే టీడీపీ లక్ష్యం
  • చంద్రబాబు ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది
  • ఏం చేశారో కూడా చెప్పుకోలేని దుస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు

తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూటమి విశాలమైన ప్రయోజనాలను కాపాడే క్రమంలోనే తమకు కేటాయించిన 14వ సీటును వదులుకున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో రెబెల్స్ లేరని... ఆశావహులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఆశావహులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని చెప్పారు. మహాకూటమి తరపున తమ అధినేత చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహిస్తారని... ఆయన ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని తెలిపారు. చంద్రబాబును విమర్శించనిదే టీఆర్ఎస్ నేతలకు పూట గడవడం లేదని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని దీన స్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు.

tTelugudesam
Chandrababu
mahakutami
ravula
campaign
route map
TRS
  • Loading...

More Telugu News