pawan kalyan: పవన్ కల్యాణ్, జనసేనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్
- పార్టీ పెట్టిన 8 నెలల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది
- 8 ఏళ్లు అయినా.. జనసేనకు 3 నుంచి 7 సీట్లు రావు
- వామపక్షాలు పవన్ కు దూరంగా వెళ్తున్నట్టు సమాచారం
గత కొంతకాలంగా మౌనంగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ మళ్లీ రంగంలోకి దిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'కాంగ్రెస్ వ్యతిరేకత. రాజకీయ శూన్యత. కమ్మ కుల అధికార దాహం. ఎన్టీఆర్ ఛరిష్మా. ఇవన్నీ కలిపి పార్టీ పెట్టిన ఎనిమిది నెలల కాలంలోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ తెలివి శూన్యత. కొణిదెల బ్రదర్స్/ఫ్యామిలీ పై అపనమ్మకం. కాపు కుల అనైక్యత. రాజకీయ సంవృద్ధి (బాబు, జగన్) కలగలిపి పవన్ రాజకీయాలలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా, జనసేన 3 నుంచి 7 సీట్లకు మించి గెలవదు.' అంటూ కామెంట్ చేశారు.
'పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే నష్టమే అని వామపక్షాలు గ్రహించాయి కాబోలు. ఈ కులసంఘం నాయకుడికి దూరంగా... కాపుసేనకి దండంపెట్టి, జగన్ వైపు చెయ్యిచాస్తున్నారని రూఢిగా సమాచారం.' అంటూ మరో పోస్ట్ లో కామెంట్ చేశారు. మరోవైపు కత్తి మహేష్ కామెంట్ పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.