vijay devarakonda: సక్సెస్ తెచ్చిన సంతోషంలో ప్రియాంక జవాల్కర్

  • 'టాక్సీవాలా'కి మంచి రెస్పాన్స్ 
  • ప్రియాంక నటనకు మంచి మార్కులు 
  • ఆమె డేట్ల కోసం దర్శక నిర్మాతల ప్రయత్నాలు  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'టాక్సీ వాలా'.. ఈ నెల 17వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలకి కొన్ని రోజులముందే ఈ సినిమా రష్ లీక్ కావడంతో, రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఈ సినిమా టీమ్ కలవరపాటుకు లోనైంది. కానీ ఈ సినిమాకి అన్ని ప్రాంతాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ సినిమా టీమ్ హ్యాపీగా ఫీలవుతోంది.

ఇక ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ కూడా, రష్ లీక్ అయినప్పుడు డీలాపడిపోయింది. కానీ ఇప్పుడు వస్తోన్న రెస్పాన్స్ చూసి సంతోషంతో పొంగిపోతోంది. ఈ అమ్మాయి గ్లామర్ .. నటన చూసినవాళ్లు, మరిన్ని అవకాశాలను అందుకోవడం ఖాయమనే అంటున్నారు. తెలుగులో కొంతమంది దర్శక నిర్మాతలు అప్పుడే ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా సమాచారం.  

  • Loading...

More Telugu News