devegouda: నా భార్య అనుభవించిన కష్టాలు జీవితకాలం మరువలేను: దేవెగౌడ

  • ఆమె నగలను పదేపదే తాకట్టు పెట్టా
  • తొమ్మిదేళ్లపాటు ఆమె నగలను ధరించలేదు
  • మరోసారి ప్రధాని కావాలనే ఆశ లేదు

బెంగళూరులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో తన భార్య గురించి మాట్లాడుతూ మాజీ ప్రధాని దేవెగౌడ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె అనుభవించిన కష్టాలు తన జీవితకాలంలో మరువలేనని చెప్పారు. డబ్బు అవసరార్థం ఆమె నగలను తాను పదేపదే తాకట్టు పెట్టానని... తొమ్మిదేళ్ల పాటు ఆమె బంగారు నగలను ధరించలేదని అన్నారు. తమను తన తల్లి చాలా కష్టపడి పెంచిందని... తన ఎదుగుదలకు తన తల్లి, భార్య ఇద్దరూ కారకులని చెప్పారు.

మరోసారి ప్రధాని కావాలనే ఆశ తనకు లేదని దేవెగౌడ స్పష్టం చేశారు. 120 కోట్ల ప్రజలను పాలించే సామర్థ్యం నాలో ఉందా? అని ప్రశ్నించారు. తనలో శక్తి ఉంటే మరోసారి లోక్ సభకు పోటీ చేస్తానని... కాంగ్రెస్ తో కలసి పని చేస్తానని చెప్పారు. కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని అన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా పరిష్కరించే సత్తా తనకుందని చెప్పారు. కుమారస్వామి భార్య అనితకు కేబినెట్ లో స్థానం కల్పిస్తారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.

devegouda
kumaraswamy
wife
Prime Minister
  • Loading...

More Telugu News