vodafone: అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లపై వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన వోడాఫోన్!

  • రూ.399, రూ.458,రూ.509 ప్లాన్ లపై వంద శాతం క్యాష్ బ్యాక్
  • రూ.50 విలువ గల వోచర్ రూపంలో లభ్యం 
  • ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలి

వోడాఫోన్ సంస్థ పలు అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్యాక్ లపై వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ రూ.50 విలువ గల వోచర్ల రూపంలో లభిస్తుంది. ఈ ఆఫర్ ని పొందాలంటే వినియోగదారులు అన్ లిమిటెడ్  రీఛార్జ్ ప్లాన్లు అయిన రూ.399, రూ.458, రూ.509లని ఎంచుకోవలసి ఉంటుంది. వినియోగదారులు ఒకవేళ రూ.509 రీఛార్జ్ ప్లాన్ ఎంచుకుంటే సదరు వినియోగదారులు రూ.50 విలువ గల పది వోచర్లని పొందుతారు. ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే ఈ ఆఫర్ కొత్త వోడాఫోన్ వినియోగదారులకి మాత్రం లభించదు. కాగా, కస్టమర్లు 'మైవోడాఫోన్' యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది.

vodafone
cashback
offer
  • Loading...

More Telugu News