Donald Trump: ట్రంప్ ముఖంతో టాయిలెట్ బ్రష్ లు.. కసికొద్దీ ఎగబడి కొంటున్న జనం!

  • తయారుచేస్తున్న న్యూజిలాండ్ కంపెనీ
  • 6-8 వారాల పాటు బుకింగ్స్ ఫుల్
  • ETSY.com వెబ్ సైట్ లో అందుబాటులోకి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాలతోనే రోజులో ఎక్కువసేపు సహవాసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ను సమర్థించేవారు ఎంతమంది ఉన్నారో, వ్యతిరేకించేవారు సైతం అదే స్థాయిలో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ బ్రష్ ల కంపెనీ ట్రంప్ ముఖచిత్రంతో టాయిలెట్ బ్రష్ ను రూపొందించింది. వీటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టగా, నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతేకాదు.. అమెరికాలో ట్రంప్ వ్యతిరేకులు ఎగబడి మరీ వీటికి ఆర్డర్లు ఇస్తున్నారు.

దీంతో సదరు కంపెనీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చినవారు తమ బ్రష్ ను అందుకోవడానికి 6-8 వారాల సమయం పట్టేంతగా వీటికి డిమాండ్ ఏర్పడింది. న్యూజిలాండ్ లోని ఓ కంపెనీ వీటిని తయారుచేస్తుండగా, ETSY.com వెబ్ సైట్ లో అమ్ముతున్నారు. అన్నట్లు ఒక్కో ట్రంప్ టాయిలెట్ బ్రష్ ధర జస్ట్ రూ.1683 మాత్రమే.
.

Donald Trump
USA
toilet brush
high demand
craze
  • Loading...

More Telugu News