Andhra Pradesh: ప్రజాసంకల్ప యాత్రలో జగన్ తో కలిసి నడిచిన ఐఏఎస్ అధికారి!

  • నేడు 301వ రోజు ప్రజాసంకల్ప యాత్ర
  • జగన్  ను కలుసుకున్న ఐఏఎస్ అధికారి కిరణ్ కుమార్
  • ప్రజలను పరామర్శిస్తూ ముందుకెళుతున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జగన్ ఈ రోజు తోటపల్లి రిజర్వాయర్ వద్ద నుంచి సీమనాయుడు వలసవరకూ పాదయాత్ర చేయనున్నారు. కాగా, ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్న జగన్ ను పశ్చిమబెంగాల్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి జి.కిరణ్ కుమార్ కలుసుకున్నారు. అనంతరం జగన్ తో కలిసి కొద్దిదూరం ముందుకు సాగారు. జగన్ ఆరోగ్యంతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితిపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. ‘ధైర్యంగా ఉండండి.. మన ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నింటిని పరిష్కరించుకుందాం’ అంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు.

Andhra Pradesh
Jagan
YSRCP
IAS officer meet
Vijayanagaram District
g.kiran kumar
  • Loading...

More Telugu News