Pawan Kalyan: మీ జాతి వ్యక్తి అయిన పవన్ కల్యాణ్ కు మద్దతిస్తారా? అనే ప్రశ్నకు సమాధానాన్ని దాటవేసిన ముద్రగడ!

  • కాపులకు రిజర్వేషన్ కల్పించేవారిని గుర్తుంచుకుంటాం
  • గవర్నర్ ఆమోదంతో 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి
  • ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా అన్యాయం చేశారు

కాపుల ఆకలి తీర్చేవారికే రానున్న ఎన్నికల్లో పట్టం కడతామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే పార్టీని గుర్తుంచుకుంటామని, వారిని 10 లక్షల మందితో సన్మానిస్తామని తెలిపారు. ఇప్పటికే గవర్నర్ ఆమోదంతో 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన కాపు, బలిజ సంఘం కార్తీక వనభోజనానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా తమ జాతికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని, కనీసం ఎంపీటీసీ అవకాశం కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా తమ జాతికి అన్యాయం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీ జాతి వ్యక్తే... ఆయనకు మద్దతిస్తారా? అనే ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు.

Pawan Kalyan
Chandrababu
mudragada
kapu
  • Loading...

More Telugu News