వేములవాడలో కాంగ్రెస్ పార్టీకి ఝులక్.. టీఆర్ఎస్ లో చేరిన ఏనుగు మనోహర్ రెడ్డి!
- కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన
- నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదని వెల్లడి
- వేములవాడ అభివృద్ధి కోసం పనిచేస్తానన్న మనోహర్
కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగే పరిస్థితులు లేవని మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థి దశ నుంచి గత 25 ఏళ్లుగా పార్టీకి అవిశ్రాంతంగా సేవ చేసినా తనను పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్ బాబుతో కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటించారు.