kapil dev: కోహ్లీ, ధోనీలపై కపిల్ దేవ్ స్పందన!

  • ధోనీ పాతికేళ్ల కుర్రాడు కాదు
  • అతని అనుభవం టీమిండియాకు ఉపయోగపడవచ్చు
  • అనుభవం, టాలెంట్ కలిస్తే విరాట్ కోహ్లీ

ధోనీ ఫామ్ తగ్గిపోయిందంటూ వస్తున్న విమర్శలపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. ఫామ్ లో లేడు అని చెప్పడానికి ధోనీ 20 లేదా 25 ఏళ్ల కుర్రాడు కాదని అన్నారు. ధోనీ నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు అర్థం కాలేదని... పాతికేళ్ల వయసులో జట్టుకు ధోనీ చేసిన సేవలను మర్చిపోరాదని సూచించారు.

ధోనీకి ఎంతో అనుభవం ఉందని... క్లిష్ట పరిస్థితుల్లో తెలివైన నిర్ణయాలను తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపించాడని... ఆ అనుభవమే భారత్ కు ఉపయోగపడవచ్చని చెప్పారు. టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ అని కితాబిచ్చారు. ఇండియా తరపున ధోనీ మరిన్ని మ్యాచ్ లు ఆడతాడని చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆటగాడని కపిల్ ప్రశంసించారు. అనుభవం, టాలెంట్ కలిస్తే కోహ్లీ అని చెప్పారు. అంతులేని ప్రతిభ, కష్టించే తత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చారు. మ్యాచ్ లు గెలవడం, ఓడిపోవడమనేది ప్రధాన అంశం కాదని... మ్యాచ్ ఎలా ఆడారనేదే ముఖ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News