Rajamouli: 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలెట్టేశాం: రాజమౌళి

  • హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
  • గత వారంలో ముహూర్తపు షాట్
  • నేటి నుంచి రంగంలోకి దిగిన యూనిట్
  • ట్విట్టర్ లో వెల్లడించిన రాజమౌళి

దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా, టాలీవుడ్ మల్టీస్టారర్ గా 'RRR' షూటింగ్ నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. గత వారంలో ముహూర్తపు షాట్ ను చిత్రీకరించిన యూనిట్, నేటి నుంచి రంగంలోకి దిగనుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'RRR' షూటింగ్ ను ప్రారంభించామని ప్రకటించారు. ఈ సందర్భంగా సెట్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దిగిన ఓ ఫోటోను ఆయన పోస్టు చేశారు. రాజమౌళి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, చిత్రం బాగా రావాలని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.



Rajamouli
NTR
Ramcharan
RRR
Shooting
Start
Tollywood
  • Loading...

More Telugu News