TRS: టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.. ముఠా గోపాల్ కు ముషీరాబాద్, మల్లయ్య యాదవ్ కు కోదాడ

  • మిగిలిన రెండు సీట్లకు అభ్యర్థుల ప్రకటన
  • రేపు నామినేషన్ వేయనున్న గోపాల్, మల్లయ్యలు
  • ఫలించని మంత్రి నాయిని ప్రయత్నాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన రెండు సీట్లకు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో, టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించినట్టయింది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్, కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ కు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో మొత్తం 119 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ముఠా గోపాల్, మల్లయ్య యాదవ్ లు ఆయా నియోజకవర్గాల్లో రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

కాగా, ముషీరాబాద్ నియోజకవర్గం టికెట్ ను తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ టికెట్ కేటాయింపు విషయమై చివరి క్షణం వరకూ నాయిని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇక మల్లయ్య యాదవ్ గురించి చెప్పాలంటే, కోదాడ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన రెండు రోజుల క్రితమే టీఆర్ఎస్ లో చేరారు. 

TRS
musheerabad
kodada
mutha gopal
mallaiah yadav
  • Loading...

More Telugu News