Salman Khan: షూటింగ్ కోసం పాకిస్థాన్ జెండా ఎగురవేసిన సల్మాన్ ఖాన్.. స్థానికుల అభ్యంతరం!

  • పంజాబ్ లో 'భరత్' సెట్
  • షూటింగ్ లో భాగంగా పాక్ జెండా ఎగరేసిన సల్మాన్
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు
  • పోలీసు కేసు నమోదు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం 'భరత్' చిత్రంలో నటిస్తున్న ఆయన, భారత భూభాగంపై పాకిస్థాన్ జెండాను ఎగురవేశాడు. సినిమా షూటింగ్ లో భాగంగానే ఇది జరిగినప్పటికీ, అక్కడి స్థానికులు, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

వాస్తవానికి ఈ సినిమా చిత్రీకరణను కథ ప్రకారం, భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో చేయాల్సివుంది. అయితే, అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అనుమతులు లభించక పోవడంతో, పంజాబ్ లో ప్రత్యేకంగా ఓ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఓ సన్నివేశంలో సల్మాన్, పాక్ జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సి వచ్చింది. ఈ సీన్ తీస్తుండగా, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. ఈ విషయంలో సినిమా యూనిట్ స్పందిస్తూ, పాక్ జెండాను ఎగురవేసింది షూటింగ్ లో భాగంగానేనని, చట్ట పరమైన సమస్యలు ఎదురుకాబోవని భావిస్తున్నామని తెలిపింది.

Salman Khan
Bharat
Movie
Bollywood
Pakistan
Flag
Police
Shooting
Case
Punjab
  • Loading...

More Telugu News