Casting Couch: గాయని చిన్మయి శ్రీపాదకు అండగా నిలిచిన నటి మంచు లక్ష్మి!

  • అందరూ మేల్కొనాల్సిన సమయం వచ్చింది
  • ఇది అందరిపై జరుగుతున్న దాడి
  • క్యాస్టించ్ కౌచ్ వ్యవహారంపై స్పందించిన లక్ష్మి

ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా చాలామంది యువతులను అవకాశాల పేరుతో లైంగికంగా వేధించారని గాయని చిన్మయి శ్రీపాద ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్బింగ్ యూనియన్ లో చిన్మయి సభ్యత్వాన్ని రద్దుచేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆరోపణలపై రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆమెకు యూనియన్ తరఫున నోటీసులు పంపారు. కాగా, ఈ వ్యవహారంలో చిన్మయికి పలువురు మహిళా ఆర్టిస్టులు, జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు.

తాజాగా ఈ గొడవపై ప్రముఖ నటి మంచు లక్ష్మి స్పందించారు. ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు. ఇది మీపై, నాపై, మనందరిపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు. ఇప్పటికైనా అమానవీయంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల నిజస్వరూపాలను బయటపెట్టాలని పిలుపునిచ్చారు.

మరోవైపు తమిళ డబ్బింగ్ యూనియన్ పంపిన నోటీసులపై చిన్మయి స్పందించారు. తాను అమెరికాలో ఉన్నందున యూనియన్ నోటీసులు అందుకోలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఓ పరిశోధనాత్మక కథనం ప్రచురించాలని వికటన్ పత్రికను కోరారు.

Casting Couch
chinmayee sripadaa
tamil dubbing association
manchu lakshimi
support
  • Loading...

More Telugu News