Hyderabad: హమ్మయ్య... టెన్షన్ పెట్టిన స్పైస్‌ జెట్‌ విమానం క్షేమం!

  • రేణిగుంటలో దిగాల్సిన స్పైస్ జెట్ విమానం
  • హైదరాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

వంద మందికి పైగా ప్రయాణికులతో ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి చేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ విమానం రేణిగుంటలో ల్యాండ్ కాకుండా, తిరిగి హైదరాబాద్ కు మళ్లడంతో, అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వుందని పైలట్ చెప్పడంతో, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అనుమతించారు. విమానాన్ని క్షేమంగా దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తదితర ప్రముఖులు ఉన్నారు. కాగా, గడచిన నెలరోజుల వ్యవధిలో ఇదే స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Hyderabad
Spice Jet
Tirupati
RP Thakur
Technical Fault
  • Loading...

More Telugu News