mohan babau: సినీ నటుడు మోహన్ బాబుతో వైసీపీ నేత విజయసాయిరెడ్డి భేటీ!

  • తిరుపతిలో కలుసుకున్న వైసీపీ ఎంపీ
  • మోహన్ బాబుకు పరామర్శ
  • జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డా.మోహన్ బాబును వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి కలుసుకున్నారు. ఇటీవల మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చిత్రపటానికి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మోహన్ బాబును పరామర్శించారు.

అంతకుముందు తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. తిరుపతిలోని తుమ్మలగుంటలో నిర్వహించిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందనీ, అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని ఆరోపించారు.

mohan babau
Vijay Sai Reddy
YSRCP
Tirupati
meeting
console
  • Loading...

More Telugu News