Prakasam District: ప్రకాశం జిల్లా కందుకూరులోని వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం...రూ.70 లక్షల ఆస్తి నష్టం

  • ఎన్టీఆర్‌ కూడలి వద్ద ఉన్న వస్త్రమాల్
  • హఠాత్తుగా చెలరేగి విస్తరించిన మంటలు
  • అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో 70 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్‌ కూడలిలో భారీ వస్త్ర దుకాణం ఉంది. ఈ దుకాణంలో ఆదివారం తెల్లవారు జామున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దుకాణం మొత్తానికి అగ్నికీలలు వ్యాపించడంతో అందులో ఉన్న దాదాపు 70 లక్షల విలువ చేసే సరుకు కాలిబూడిదయిందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Prakasam District
kandukuru
Fire Accident
  • Loading...

More Telugu News