Khammam District: ఖమ్మం జిల్లాలో రేపు సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం... జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ

  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సభకు చురుకుగా ఏర్పాట్లు
  • పలు ప్రాంతాల్లో పర్యటించనున్నముఖ్యమంత్రి
  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రం ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో గులాబీ బాస్‌ ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు చురుకుగా చేపడుతున్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బహిరంగ సభ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సభ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ముఖ్యమంత్రి ప్రసంగం అందరికీ స్పష్టంగా వినిపించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌తోపాటు పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా సభా స్థలిని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Khammam District
CM KCR
election tour
  • Loading...

More Telugu News