TRS: గెలుపే లక్ష్యం... 120 మంది రుత్వికులతో కేసీఆర్ రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమం!

  • మరో యాగాన్ని తలపెట్టిన కేసీఆర్
  • నేటి నుంచి రెండు రోజుల పాటు యాగం
  • ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ వర్గాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మరో యాగాన్ని తలపెట్టారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేతంలో నేటి నుంచి రెండు రోజుల పాటు రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాన్ని ఆయన తలపెట్టారు. ఇప్పటికే యాగశాలతో పాటు మిగతా అన్ని ఏర్పాట్లూ పూర్తికాగా, సుమారు 120 మంది రుత్వికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యాగం విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2015లో ఇదే వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

TRS
KCR
Erravalli
Yagam
  • Loading...

More Telugu News