Shilpa Shetty: రూ. 25 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం... శిరిడీ సాయికి బహూకరించిన శిల్పాశెట్టి!

  • 'సాహసవీరుడు సాగరకన్య' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచితం
  • శిరిడీకి వచ్చి సాయిబాబాకు ప్రత్యేక పూజలు
  • 800 గ్రాముల బరువైన బంగారు కిరీటం కానుక

బాలీవుడ్‌ నటి, 'సాహసవీరుడు సాగరకన్య' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన శిల్పాశెట్టి, తన భర్త రాజ్‌ కుంద్రాతో కలసి శిరిడీ సాయిబాబాను దర్శించుకుని విలువైన కానుకలు సమర్పించుకున్నారు. బాబాపై తనకున్న భక్తితో ఓ బంగారు కిరీటాన్ని అందించారు.

ప్రతి సంవత్సరమూ శిరిడీకి వచ్చే శిల్పాశెట్టి, ఈ దఫా, 800 గ్రాముల బరువుతో వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సాయికి కానుకగా అందించారు. దాదాపు గంట పాటు ఆలయంలోనే ఉన్న శిల్పా దంపతులు, సాయికి ప్రత్యేక పూజలు చేశారు. తాను సాయిని దర్శించుకున్న చిత్రాలను శిల్పా శెట్టి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.

Shilpa Shetty
Raj Kundra
Shirdi
Saibaba
Gold
  • Loading...

More Telugu News