Rakul Preet Singh: ఏ భాషైనా, 'జంబలకిడిపంబ' అయినా... రకుల్ ప్రీత్ పై మంచు లక్ష్మి కామెంట్!

  • తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్
  • మంచు లక్ష్మితో మంచి స్నేహం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్లు

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువమంది హీరోలతో నటించి, టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కు, మంచు లక్ష్మికి ఉన్న స్నేహం ఎంత బలమైందో ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎన్నో పార్టీల్లో వీరిద్దరూ కలసి కనిపించారు. వీరిద్దరినీ టాలీవుడ్  బెస్ట్ ఫ్రెండ్స్ కపుల్ గానూ చెబుతుంటారు.

ఇక తాజాగా రకుల్ ప్రీత్, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మంచు లక్ష్మితో దిగిన ఫోటో షేర్ చేయగా, లక్ష్మి సరదా కామెంట్ పెట్టింది. "నువ్వు ఇక్కడ ఉండేందుకే వచ్చావు బేబీ. తెలుగు, తమిళ్, హిందీ, జంబలకిడిపంబ ఏ భాషైనా.. నువ్వు అద్భుతమైన ఆర్టిస్టువి" అని కామెంట్ చేసింది. దీనిపై రకుల్ కూడా స్పందించింది. మంచు లక్ష్మి మాటల్లోని తీయదనంతో తనకు షుగర్ వ్యాధి వచ్చేలా వుందని, ఐ లవ్ యూ అని చెప్పింది. వీరిద్దరి సంభాషణా వైరల్ అవుతుండగా, రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Rakul Preet Singh
Manchu Lakshmi
Social Media
  • Loading...

More Telugu News