Jagan: కోడికత్తి కోసం ఇంటర్‌పోల్ రావాలా? ఇప్పుడు నిద్రలేచారా?: ఆనంద్ బాబు ధ్వజం

  • కోడికత్తికి, సీబీఐకి లింక్ పెట్టాలని చూస్తున్నారు
  • జగన్ కుటుంబ చరిత్రంతా నేరపూరితం
  • ఏపీలో పోటీ చేసేందుకు జగన్‌కు అర్హత లేదు

తనపై హత్యాయత్నం కుట్ర చేయకుంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని నేడు పార్వతీపురం బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోడికత్తి ఘటన కోసం ఇంటర్‌పోల్ వచ్చి దర్యాప్తు చేయాలా? అంటూ విరుచుకుపడ్డారు.

కోడికత్తికి.. సీబీఐకి లింక్ పెట్టాలని జగన్ చూస్తున్నారని ఆనంద్‌బాబు ఆరోపించారు. దాడి జరిగి 23 రోజులవుతుంటే.. ఇప్పుడు నిద్రలేచారా? అని ప్రశ్నించారు. జగన్ కుటుంబ చరిత్రంతా నేరపూరితమని... ఏపీలో పోటీ చేసేందుకు ఆయనకు ఏమాత్రం అర్హత లేదన్నారు. జగన్ చరిత్రేంటో.. చంద్రబాబు చరిత్రేంటో ప్రజలందరికీ తెలుసని ఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు.

Jagan
Chandrababu
Nakka Anand Babu
Parvathipuram
  • Loading...

More Telugu News