Marri Sasidhar reddy: శశిధర్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి పయనం

  • సనత్ నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కలత
  • పునరాలోచించాలని డిమాండ్
  • గెలుపు కోసం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా

అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించేలా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన విషయంలో వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వాపోయారు. సనత్ నగర్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంతో ఆయన కలత చెందారు. మరోసారి పునరాలోచన చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని ఆయన డిమాండ్ చేశారు.

నేటి మధ్యాహ్నం శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను పదవులకోసం పాకులాడే వ్యక్తిని కానని.. గెలుపు కోసం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. స్క్రీనింగ్ కమిటీలో భాగంగా ఉత్తమ్ తాను గెలవలేనని వాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ సాయంకాలం ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. కాంగ్రెస్ ముఖ్య నేత అహ్మద్‌పటేల్ ఫోన్ చేసి శశిధర్‌రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారు. దీంతో ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.

Marri Sasidhar reddy
Uttam Kumar Reddy
Ahmad Patel
Delhi
  • Loading...

More Telugu News