CBI: సీబీఐకి సమ్మతి ఉపసంహరణ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న పంజాబ్ ప్రభుత్వం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ab83a24d3e37866d92ada67d196ddc56aaa25565.jpg)
- చంద్రబాబు బాటను అనుసరించిన మమతా
- ‘జనరల్ కన్సెంట్’ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన
- సీబీఐపై నిర్ణయం తీసుకోలేదన్న పంజాబ్ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సీఎం చంద్రబాబు బాటనే అనుసరించారు. సీబీఐకి 1989లో నాటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ‘జనరల్ కన్సెంట్’ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
తాజాగా పంజాబ్ కూడా ఇదే తరహాలో స్పందించినట్టు వార్తలు వచ్చినప్పటికీ... ఇంకా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియా సలహాదారు రవీన్ తక్రాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకైతే సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకునే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ఏ నిర్ణయమైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పర్యవేక్షించే కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.