jagan: చంద్రబాబు దారుణ పాలనకు ఇదొక నిదర్శనం: విశాఖ దాడి తర్వాత జగన్ తొలి ప్రసంగం

  • తోటపల్లి ప్రాజెక్టును విస్మరించారు
  • అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేస్తున్నారు
  • ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు

విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత పార్వతీపురంలో వైసీపీ అధినేత జగన్ తొలిసారి బహిరంగసభలో ప్రసంగించారు. ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు విస్మరించారని... 80వేల ఎకరాలకు ఇప్పటి వరకు సాగునీరు అందలేదని రైతులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.

వైయస్ హయాంలో 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని... మిగిలిన 10 శాతాన్ని చంద్రబాబు పూర్తిచేయలేకపోయారని... చంద్రబాబు దారుణ పాలనకు ఇదో నిదర్శనమని చెప్పారు. టీడీపీ నేతలంతా దోపిడీకే పరిమితమయ్యారని అన్నారు. అగ్రిగోల్డ్ కు చెందిన విలువైన ఆస్తులను చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు కాజేస్తున్నారని దుయ్యబట్టారు. 

jagan
padayatra
Chandrababu
parvathipuram
YSRCP
Telugudesam
agri gold
  • Loading...

More Telugu News