danam nagender: నాతో పోటీ పడేవారే లేరు.. 50 వేల మెజార్టీ ఖాయం: దానం నాగేందర్

  • కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయం
  • టీఆర్ఎస్ లో అసమ్మతి లేదు
  • కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకే మద్దతిస్తున్నారు

ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు దానం నాగేందర్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనతో పోటీ పడే వారే లేరని చెప్పారు. ఖైరతాబాద్ లో 50 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కడతారని చెప్పారు.

కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ లో అసమ్మతి లేదని, ఎన్నికల బరిలో టీఆర్ఎస్ రెబెల్స్ ఉండరని చెప్పారు. ఎన్నికల్లో తాను డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని... గెలవడానికి కేసీఆర్ పథకాలు, తన ఓటు బ్యాంకు చాలని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తనకే మద్దతిస్తున్నారని చెప్పారు. బస్తీల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 15వేల వరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టబోతున్నామని దానం చెప్పారు. సమర్థవంతమైన నాయకుడు కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 

danam nagender
khairatabad
TRS
nomination
  • Loading...

More Telugu News