Telangana: తెలంగాణలో రెండుగా చీలిన పవన్ అభిమానులు.. టీఆర్ఎస్ కు ఓ వర్గం మద్దతు!

  • హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి
  • మద్దతు ప్రకటించిన ఓ వర్గం
  • ఏకపక్ష నిర్ణయాలపై మరోవర్గం ఆగ్రహం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య విభేదాలు తలెత్తాయి. హుజూర్ నగర్ లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసిన కొందరు పవన్ అభిమానులు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై మిగతా సభ్యులు మండిపడ్డారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ అభిమాన సంఘానికి తెలియకుండా, జిల్లాలోని తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని మిగతా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు సైదిరెడ్డికి మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో నిరసనకు దిగారు. ఈ విషయమై హైదరాబాద్ లోని అభిమాన సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో పవన్ అభిమానులు రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. కాగా, ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Telangana
Pawan Kalyan
Janasena
fans
groups
divided
TRS
hujurnagar
saidireddy
support
  • Loading...

More Telugu News