Telangana: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని సాగనంపే సమయం వచ్చింది!: విజయశాంతి

  • రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
  • 10 మంది మహిళలకు సీట్లు ఇచ్చాం
  • కేసీఆర్ కేబినెట్ లో మహిళలే లేరు

తెలంగాణలో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని చెప్పారు. కరీంనగర్ లో ఈ రోజు నిర్వహించిన మహిళా సదస్సులో విజయశాంతి మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 10 మంది మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఒక్క మహిళా మంత్రి కూడా లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Telangana
TRS
KCR
farm house chief minister
vijayasanthi
Congress
mahakutami
  • Loading...

More Telugu News