nandita shweta: 'అక్షర' మూవీ లాంచ్ .. క్లాప్ ఇచ్చిన దిల్ రాజు

- తెలుగు తెరపైకి మరో హారర్ థ్రిల్లర్
- నందిత శ్వేత ప్రధాన పాత్రగా 'అక్షర'
- దర్శకుడిగా చిన్నికృష్ణ పరిచయం
తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను నందిత శ్వేత పోషించనుంది. ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. సినిమా హాల్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది.
