Warangal Rural District: నేను పార్టీ వీడుతున్నానంటూ రేవంత్‌ రెడ్డి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు : ఎంపీ సీతారామ్‌ నాయక్‌

  • రేవంత్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు
  • ఆయన ఎత్తుగడలు పనిచేయవు 
  • ప్రాజక్టులు సాధించిన ఘనత టీఆర్ఎస్ దే   

తాను పార్టీ వీడుతున్నానంటూ తప్పుడు ప్రచారంతో రేవంత్‌ రెడ్డి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని, ఆయన ఎత్తుగడలు ఫలించవని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. వరంగల్‌ జిల్లా ఖానాపురంలో నర్సంపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీతారాం నాయక్‌ సమాధానం చెప్పారు. రేవంత్‌ రెడ్డి ఖబడ్దార్‌ అంటూ ఘాటుగా హెచ్చరించారు. కేసీఆర్‌ ఆశీర్వాదంతో పాకాల, రంగరాయ ప్రాజెక్టులు సాధించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్‌ జిల్లాలోని 12 సీట్లను టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా ఏదో రూపంలో లబ్ధిపొందిన వారు ప్రతి ఇంటిలో ఉన్నారని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలవడం తధ్యమన్నారు.

Warangal Rural District
narsampeta
MP sitaramnayak
  • Loading...

More Telugu News