tTelugudesam: తెలంగాణ టీడీపీ నాలుగో జాబితా విడుదల..సనత్ నగర్ కి అభ్యర్థి ప్రకటన!

  • సనత్ నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్
  • అధికారికంగా ప్రకటించిన టీటీడీపీ
  • 14 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, టీడీపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒక అభ్యర్థి పేరును ప్రకటించింది. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పేరును టీటీడీపీ అధికారికంగా ప్రకటించింది. మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో 9 మంది పేర్లను, రెండో జాబితాలో ఇద్దరి పేర్లను, మూడో జాబితాలో నందమూరి సుహాసిని పేరును ప్రకటించిన టీటీడీపీ... తాజాగా మరొక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. మరొక స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. 

tTelugudesam
candidates
list
4th
sanath nagar
kuna venkatesh goud
  • Loading...

More Telugu News