Andhra Pradesh: నందమూరి సుహాసిని పొలిటికల్ ఎంట్రీ.. స్పందించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!

  • టీడీపీ మాకు చాలా పవిత్రమైనది
  • నాన్న పార్టీకి జీవితాంతం సేవలందించారు
  • సుహాసిని అక్కకు ఆల్ ది బెస్ట్

ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సొదరుడు కల్యాణ్ రామ్ తెలిపారు. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైనదన్నారు. తమ తండ్రి హరికృష్ణ సేవలు అందించిన టీడీపీ తరఫున కూకట్ పల్లి నుంచి తమ సోదరి సుహాసిని పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.

సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్రను పోషించాలని నందమూరి కుటుంబం నమ్ముతుందని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న తమ సోదరి సుహాసినిని విజయం వరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇద్దరు హీరోలు ట్విట్టర్ లో స్పందించారు.

‘ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న అక్క సుహాసినికి ఆల్ ది బెస్ట్’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా, ‘సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సోదరి సుహాసినికి ఆల్ ది బెస్ట్’ అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telangana
SUHASINI
NANDAMURI
NTR
KALYAN RAM
Twitter
  • Loading...

More Telugu News