Bhadradri Kothagudem District: ఆశ్వారావుపేట టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ...పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు

  • ఎంపీపీ బాలూనాయక్‌, ఆయన అనుచరులు పార్టీకి రాంరాం
  • మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీరుపై ఆగ్రహం
  • ఒకరిద్దరికే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి షాక్‌ తగిలింది. పార్టీ ఎంపీపీ బాలూనాయక్‌, ఆయన అనుచరులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ తామీ నిర్ణయం తీసుకున్నట్లు నాయక్‌ ప్రకటించారు.

చుండ్రుగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలూనాయక్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరిని కలుపుకొని పోవాల్సింది పోయి ఒకరిద్దరికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. పైగా మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాటి విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బాలూనాయక్‌తోపాటు గుంపెన సొసైటీ వైస్‌ చైర్మన్‌ మేడ మోహనరావు, డైరెక్టర్‌ అంగోత్‌ లక్ష్మణ్‌, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు.

Bhadradri Kothagudem District
aswaraopeta constituanncy
TRS
  • Loading...

More Telugu News