Chandrababu: చంద్రబాబు లేఖతోనే తెలంగాణ.. టీఆర్ఎస్ పాలనపై భ్రమలు తొలగిపోయాయి: నామా

  • చంద్రబాబుపై టీడీపీ దుష్ప్రచారం
  • తెలంగాణ అభివృద్ధిని ఆయనెందుకు అడ్డుకుంటారు?
  • ప్రజాకూటమికి అధికారం ఖాయం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖతోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయాయని అన్నారు. టీఆర్ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా కూటమికి అధికారం ఖాయమని జోస్యం చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిస్తూ చంద్రబాబు లేఖ ఇవ్వడంతోనే తెలంగాణ సాకారమైందన్న నామా.. చంద్రబాబుపై టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటారనడంలో నిజం లేదన్నారు.

Chandrababu
Telugudesam
Khammam District
Nama Nageshwara Rao
TRS
  • Loading...

More Telugu News