Chandrababu: రేపు తెలంగాణను చంద్రబాబుకు అమ్ముకోరని నమ్మకమేంటి?: కేటీఆర్

  • బలహీన వర్గాల బలమైన గొంతుక కేసీఆర్
  • కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారు
  • మల్లయ్య యాదవ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది

మూడు కోట్లకు టికెట్ అమ్ముకుంటున్నవారు.. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకోరా? అని టీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ ప్రశ్నించారు. రేపు తెలంగాణను చంద్రబాబుకు అమ్ముకోరని నమ్మకమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బలహీన వర్గాల బలమైన గొంతుకగా అభివర్ణించారు.

  కోదాడలో గులాబీ జెండా ఎగరాలని అక్కడి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. సీల్డు కవర్ సీఎం కావాలా? సింహం లాంటి సీఎం కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మహాకూటమిలో మల్లయ్య యాదవ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Chandrababu
KTR
KCR
Kodada
Congress
Mallaiah Yadav
  • Loading...

More Telugu News