R.Narayana Murthy: చంద్రబాబు ఆ పోరాటమేదో నాలుగేళ్ల క్రితమే చేసుంటే హోదా వచ్చేది: ఆర్.నారాయణమూర్తి

  • ఏపీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది
  • ప్రత్యేక హోదా ఇస్తామన్న నేతలు ఏమయ్యారు?
  • తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ మాట తప్పారు

ఏపీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని, ప్రత్యేక హోదా ఇస్తామన్న నేతలు ఏమయ్యారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. నేడు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నేడు కేంద్రంపై చేస్తున్న పోరాటమేదో నాలుగేళ్ల క్రితమే చేసుంటే హోదా వచ్చి ఉండేదని పేర్కొన్నారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్ అంశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని నారాయణమూర్తి డిమాండ్ చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ తానిచ్చిన మాట తప్పారని ఆరోపించారు.

R.Narayana Murthy
Chandrababu
Vijayanagarm
Narendra Modi
Vishakha Railway Zone
  • Loading...

More Telugu News