kcr: నన్ను ఆదరించిన కేసీఆర్ కు రుణపడి ఉంటా: టీఆర్ఎస్ లో చేరిన మల్లయ్య యాదవ్

  • నా లాంటి నాయకుడికి అన్యాయం జరగొద్దని అన్నారు
  • అందుకే, కేసీఆర్ నన్ను ఆదరించారు
  • టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి

కోదాడ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ టీ-టీడీపీ కోదాడ నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లయ్యకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ, తన లాంటి నాయకుడికి అన్యాయం జరగొద్దని సీఎం కేసీఆర్ తనను ఆదరించారని, తనను ఆదరించిన కేసీఆర్ కు రుణపడి ఉంటానని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా ఉండి పది మందికీ ఉపయోగపడాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

kcr
mallaiah yadav
kodada
KTR
  • Loading...

More Telugu News